ఏ ఒక్క లబ్ధిదారుడు నష్ట పోకూడదు
NEWS Jan 19,2025 04:17 pm
పేద, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలువాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా అంకిత భావంతో కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.