పాఠశాలను సందర్శించిన విద్యాధర్ రావు
NEWS Jan 19,2025 04:20 pm
సాతారం గ్రామానికి చెందిన NRI గండ్ర విద్యాధర్ రావు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు టాయిలెట్స్ కోసం సుమారు రూ.2 లక్షలను వీ.యస్.జీ అసిస్ట్ పౌండేషన్ ద్వారా పాఠశాలకు అందించారు.10వ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు రూ. పదివేల నగదు బహుమతి అందజేశారు. అనంతరం గ్రామాభివృద్ధి గురించి చర్చించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.