జనవరి 21న ఆశా వర్కర్ల సమస్యలపై జరిగే పాదయాత్రను జయప్రదం చేద్దామని సిఐటియ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. బోర్గం బ్రిడ్జి నుండి ముగింపు ధర్నాచౌక్ లో ఉంటుందన్నారు. పాదయాత్రకు ఆశ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోటో అమలు చేయాలన్నారు.