గ్రామీణ ప్రాంతాలలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమిత్ షా సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ ఇస్తామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం లాంటిదన్నారు. గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు.