రాష్ట్రాన్ని ఆదుకోక పోతే అధోగతే
NEWS Jan 19,2025 10:45 am
ఆర్థికంగా చితికి పోయిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నామని వాపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్నామన్నారు. నిలదొక్కుకునేంత వరకు తమకు చేయూత ఇవ్వాలని కోరారు సీఎం. గోదావరి నుండి బనకచర్ల దాకా నదులను అనుసంధానం చేస్తున్నామన్నారు.