మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనను అంతం చేయడంలో లోకేష్ పాత్ర కీలకమైందన్నారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రతోనే టీడీపీకి పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ పేరును పరిశించాలని కోరారు సోమిరెడ్డి.