కారు, బైక్ ఢీ - ఒకరి మృతి
NEWS Jan 19,2025 06:25 am
కోరుట్ల: మోహన్ రావు పేట గ్రామ శివారులో రాత్రి కారు ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు లోని ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు కోరుట్ల పట్టణానికి చెందిన వారిగా సమాచారం. ప్రమాదంలో మరణించిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా వాసిగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారిస్తున్నారు.