ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము నిలదీస్తేనే కానీ నిరుపేదల గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రజా పాలన దరఖాస్తులకు ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. మీ సేవా దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలన్నారు.