తిరుమలకు పోటెత్తిన భక్తులు
NEWS Jan 19,2025 04:12 am
తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. 75 వేల 931 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. కాగా గడిచిన 9 రోజులలో 6,12,208 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి అనుమతించే ప్రసక్తి లేదన్నారు.