వైభవోపేతం శ్రీనివాస కళ్యాణం
NEWS Jan 19,2025 03:16 am
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవోతపేంగా జరిగింది. ప్రధాన అర్చుకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లకు పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మ వార్ల కల్యాణాన్ని నిర్వహించారు.