వైసీపీకి షాక్ రవిచంద్రారెడ్డి జంప్
NEWS Jan 19,2025 02:07 am
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన కె. రవి చంద్రా రెడ్డి వైసీపికి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. వెంటనే ఆయన ఏపీ బీజీపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి సత్య కుమార్ యాదవ్ ల సమక్షంలో బీజేపీలో చేరారు. ఇన్నాళ్ల పాటు వైసీపీలో గుర్తింపు కల్పించినందుకు జగన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రవిచంద్రారెడ్డి.