రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్వే ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించారు. కొత్త కార్డులతో పాటు పాత కార్డుల్లో అదనంగా కుటుంబీకులు ఎవరైనా ఉంటే చేర్చుతామని స్పష్టం చేశారు. తొలుత కుల గణన పూర్తయిన వారికి అందజేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.