తనను కావాలని ఇరికించే కుట్ర కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్. కొన్ని శక్తులు తనను ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పగించిన పదవికి న్యాయం చేశానే తప్పా ఏనాడూ రూల్స్ అతిక్రమించ లేదని స్పష్టం చేశారు. తనపై ఎన్ని కమిటీలు వేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇలాంటి వాటిని తాను ఎన్నో చూశానని అన్నారు.