స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కావాలి
NEWS Jan 19,2025 01:33 am
స్వచ్ఛత, శుభ్రత అనేది ప్రజల నినాదంగా మారాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా పచ్చదనం, పరిశుభ్రత మీద దృష్టి పెట్టిందని చెప్పారు. ప్రతి ఒక్కరు పారిశుధ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలని, ఇంటి ముందు తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.