మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జల్ పల్లిలోని తనకు చెందిన ఆస్తుల్లో కొందరు తిష్ట వేశారని, వారిని వెంటనే ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా తను తిరుపతిలో ఉంటున్నారు. మరో వైపు మంచు మనోజ్ తన భార్యతో కలిసి జల్ పల్లిలో ఉంటున్నారు. తండ్రీ కొడుకుల మధ్య వార్ తారా స్థాయికి చేరుకుంది.