రొళ్ల మండలంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
NEWS Jan 18,2025 12:22 pm
తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా రొళ్ల మండల టిడిపి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం అన్నారు. తెలుగువాడి విశ్వరూపం వెండితెరపై రారాజుగా వెలుగొందిందని అన్నారు.