ఏ విపత్తైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
NEWS Jan 18,2025 09:01 am
రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. ఏపీ రక్షణ కోసం బీజం వేసిన సీఎం చంద్రబాబు ఆకాంక్ష రేపటితో నెర వేరనుందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండ పావులూరులో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను ఆదివారం ప్రారంభించనున్నారని తెలిపారు.