పసుపు బోర్డు ఏర్పాటులో తుమ్మల పాత్ర ఏంటీ
NEWS Jan 18,2025 08:13 am
పసుపు బోర్డు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొనడం హాస్యాస్పదమని, బోర్డు ఏర్పాటులో ఆయన పాత్ర ఏంటో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదని భూపతిరెడ్డి అడుగుతున్నారని, అర్బన్‌లో షబ్బీర్ అలీ, ఆర్మూర్‌లో వినయ్‌రెడ్డి, బాల్కొండలో సునీల్ ఏ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో చెప్పాలని సవాల్ విసిరారు