కుంభమేళాలో గంగా హారతి
NEWS Jan 18,2025 06:07 am
మహా కుంభ మేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ లో టీటీడీ అర్చకులు గంగా హారతి సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయం నుండి శ్రీ శ్రీనివాస స్వామిని ఘాట్ వద్దకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ నడుమ హారతి సమర్పించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, సుపరింటెండెంట్ గురు రాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.