గుప్త నిధుల పేరుతో తవ్వకాలు
NEWS Jan 18,2025 05:57 am
లింగంపేట్ మండలం కోమట్‌పల్లి, కేశాయిపేట గ్రామాల శివారులో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం. పూజలు చేసి గుంత తీసి పూడ్చినట్లు ఉండడంతో గుప్త నిధుల కోసం తవ్వినట్లు గుర్తించారు. సదరు స్థలం గ్రామానికి చెందిన గంపల సాయిలుకు చెందినది కాగా,పూజలు గ్రామస్తులు చేసినట్లు గుర్తించారు.గతంలో సాయిలు అదే ప్రదేశంలో బోరు వేయడంతో గుప్తనిధులు కనిపించినట్లు ప్రచారం జరిగింది. అదే సంవత్సరం సాయిలు భార్య అనారోగ్యానికి గురై చనిపోవండంతో గ్రామస్తులు అటువైపు వెళ్లడం మానేశారు.