పోలీస్ సేవలకు ఫీడ్‌బ్యాక్
NEWS Jan 18,2025 04:23 am
నిజామాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్లలో సిబ్బంది పనితీరు తెలుసుకునేందుకు శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఠాణాలకు వచ్చే ప్రజలకు వారు అందించిన సేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. ప్రజలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక,పేరు, స్టేషన్ పరిధి, మొయిల్ ఐడీ, ఫోన్ నంబర్, బాధితుడి సమస్య, సిబ్బంది పనితీరు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత మెసేజ్ లేదా ఫోన్ చేయాలా అనే ఆప్షన్ ఉంటుంది. వివరాలను పూర్తి చేసిన తర్వాత ఆప్‌లోడ్ చేస్తే సీపీ, డీజీపీ కార్యాలయాలకు వివరాలు వెళ్తాయి.