లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలి
NEWS Jan 18,2025 12:17 pm
ప్రభుత్వం ఈ నెల 26 నుంచి 4 కొత్త పథకాలు అమలు చేయనున్న నేపథ్యంలో అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ పొన్న, ఆదిలాబాద్ అర్బన్ లోని అనుకుంటా గ్రామాలలో పర్యటించి, సంబంధిత అధికారులు చేస్తున్న రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల సర్వే సూపర్ చెక్ ల ఫీల్డ్ వెరిఫికేషన్ ను స్వయంగా పరిశీలన చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా పని చేయాలని సూచించారు.