పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Jan 18,2025 05:06 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర జిల్లా పరిషత్ హై స్కూల్ లో 2004-2005 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో పనిచేసిన ఉపాధ్యాయులను పిలిచి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు చాలాకాలం తర్వాత కలిసిన సందర్భంగా మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు.