పసుపు బోర్డు ఏర్పాటులో కాంగ్రెస్‌ది కీలకపాత్ర
NEWS Jan 17,2025 10:43 am
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు లో కాంగ్రెస్ పాత్ర కీలకమని, నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం మూడు దశాబ్దాలుగా పసుపు రైతులు ఎన్నో పోరాటాలు చేశారని, ఒక్క బీజేపీ వల్ల మాత్రమే బోర్డు రాలేదన్నారు. పసుపు బోర్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ మంత్రి కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు.ఆర్యనగర్‌లో స్పైసెస్ బోర్డు పేరుతో కార్యాలయం తెరచి, ఎలాంటి కార్యకలాపాలు చేయలేదని,పసుపుబోర్డు కార్యాచరణ ఉంటుందన్నారు.