కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు
NEWS Jan 17,2025 10:43 am
సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటు పడిపోయాయని విమర్శించారు. పదేళ్లలో కరెంటు అదనంగా ఉత్పత్తి చేయలేక పోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు