వివాదాస్పద నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీ రోల్ లో నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ ఎత్తున ఆదరణ చూరగొంటోంది. ఆనాటి దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో దేశంలో చోటు చేసుకున్న అప్రకటిత ఎమర్జెన్సీకి సంబంధించి తెర కెక్కించే ప్రయత్నం చేశారు. జయప్రకాశ్ నారాయణ్ గా అనుపమ్ ఖేర్ నటించారు. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ కలకలం రేపుతోంది.