బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఈ మధ్యన భారత జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శనతో తీవ్ర నిరాశ పరిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సీరీస్ ను కోల్పోయింది. ప్రధాన ఆటగాళ్లు ఆశించిన మేర రాణించ లేక పోయారు. మరో వైపు టాపార్డర్ పూర్తిగా వైఫల్యం చెందడం, డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడిన కామెంట్స్ బయటకు రావడంతో బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగింది. ఈ మేరకు క్రికెటర్లకు కఠిన నియమావళిని రూపొందించింది. 10 పాయింట్లను ప్రకటించింది.