శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు
NEWS Jan 17,2025 05:47 am
కోరిన కోర్కెలు తీర్చే తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో అలరారుతోంది. స్వామి వారిని 67 వేల 115 మంది దర్శించుకున్నారు. 16 వేల 656 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.