ఫార్ములా ఇ కార్ రేసు కేసుకు సంబంధించి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఆరున్నర గంటలకు పైగా తనపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. తాను ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అరెస్ట్ చేసినా తాను అదరను..బెదరనంటూ స్పష్టం చేశారు.