సంక్రాంతి పండుగ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారీ ఆదాయం సమకూరింది ప్రయాణీకుల రూపేణా. ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు 7,200 బస్సులను ఆర్టీసీ నడిపించింది. ఇప్పటి దాకా రూ. 12 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని ఎండీ వెల్లడించారు. 4 లక్షల మందికి పైగా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే పండుగకు 4.3 లక్షల మంది ప్రయాణించగా ఈసారి మరింత పెరగనుంది సంఖ్య.