సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై. తన ఐదేళ్ల పాలనా కాలంలో ఏపీని సర్వ నాశనం చేశాడని మండిపడ్డారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడాడంటూ ఎద్దేవా చేశారు. చివరకు దిక్కులేని దానిగా మార్చేశాడని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైందని వాపోయారు . వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసానికి గురైనట్లు తెలిపారు. ఏపీకి రావాలంటేనే భయపడే స్థితికి తీసుకు వచ్చాడని ధ్వజమెత్తారు.