గద్దర్ గళం ఫౌండేషన్ కోరుట్ల కమిటీ
NEWS Jan 15,2025 03:38 pm
గద్దర్ గళం ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గజ్జెల స్వామి సారథ్యంలో కోరుట్ల మండలంలో కమిటీ నియమించారు. ఈ కమిటీ జిల్లా కన్వీనర్ ఈదుల లక్ష్మణ్ కుమార్, కో-కన్వీనర్ వన తడుపుల అంజయ్య ఆధ్వర్యంలో కోరుట్ల మండలం కన్వీనర్ గా రచయిత, గాయకుడు పంచరి ప్రవీణ్ కుమార్, కోకన్వీనర్ గా ఉద్యమ గాయకులు బాణావత్ రూప్ సింగ్ నాయక్ నియమించారు. కార్యక్రమంలో సుతారి రాములు, చిన్న విశ్వనాథం, ఎండి మౌలానా, నలువాల రా, జంగిలి స్వామి, భూక్య గంగాధర్ ఉన్నారు.