ఏసీబీకి పట్టుబడిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్
NEWS Jan 15,2025 09:43 am
రూ. 5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫోద్దీన్. మెట్ పల్లి పట్టణం సాయిరాం కాలనీ లో ని 266 గజాల స్థలం ను మార్టికేజ్ చేయడానికి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవి కుమార్ , డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది ఏసీబీ.