అండర్ 19 క్రికెట్ టొర్నీ విజేత పైడిమడుగు
NEWS Jan 15,2025 03:27 pm
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో అండర్ 19 క్రికెట్ టొర్నీ నిర్వహించారు.ఈ టొర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనగా, ఫైనల్ కు జోగిన్ పల్లి టీం, పైడిమడుగు టీం చేరుకున్నాయి. పైడిమడుగు జట్టు గెలుపొందింది. మొదటగా పైడిమడుగు జట్టు 10 ఓవర్లలో 70 పరుగులు చెయ్యగా, జోగిన్ పల్లి జట్టు 55 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. గెలుపొందిన పైడిమడుగు జట్టుకు ట్రోపిని అందించారు. తురగ సతీష్ రెడ్డి ఆర్గనైజేషన్ లో ఈ క్రికెట్ టొర్నీ నిర్వహించారు.