బీజేపీ..ఆర్ఎస్ఎస్ లపై పోరాటం ఆగదు
NEWS Jan 15,2025 08:21 am
ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. స్వాతంత్రాన్ని కించ పరిచేలా భగవత్ మాట్లాడుతున్నారంటూ వాపోయారు. ఆంగ్లేయులపై పోరాడిన వారిని, తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని అవమానించారని ఆరోపించారు. వాళ్లంతా ఒకే ఎజెండాతో వెళుతున్నారని మండిపడ్డారు.