సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు
NEWS Jan 15,2025 07:55 am
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలే ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ సర్కార్ కావాలనే కేటీఆర్ పై కక్ష సాధింపుతో కేసు నమోదు చేసిందని లాయర్ సుదరం వాదించారు. వాదోపవాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.