వైకుంఠ ద్వార దర్శనాల కోటా విడుదల
NEWS Jan 15,2025 05:28 am
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు జారీ చేసింది. ఈనెల 16వ తేదీకి సంబంధించి విడుదల చేసిన కోటా పూర్తయినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ఇవాళ 17వ తేదీ శుక్రవారం స్వామి వారి దర్శనానికి సంబంధించి టోకెన్ల కోటాను విడుదల చేసినట్లు తెలిపారు. తిరుపతి లోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్లు జారీ చేస్తామని భక్తులు సంయమనం పాటించి ఉచిత టోకెన్లు తీసుకోవాలని కోరారు.