తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Jan 15,2025 05:12 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. సంక్రాంతి పండుగ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు శ్రీవారిని దర్శించుకునేందుకు. టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. స్వామి, అమ్మ వార్లను 78 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. 17 వేల 406 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.44 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు.