తిరుమల లడ్డూ విషయంపై మౌనమేల..?
NEWS Jan 15,2025 05:08 am
వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. కూటమి సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో చోటు చేసుకున్న ఘటన బాధాకరమన్నారు. బాధ్యులైన వారిపై ఇప్పటి దాకా చర్యలు తీసుకోలేదన్నారు. లేకుంటే తాము కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తిరుమల లడ్డూ విషయంలో నానా యాగీ చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.