పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం
NEWS Jan 14,2025 09:18 am
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా నేటి నుంచి పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. పసుపు బోర్డుకు ప్రస్తుతం స్పైస్ బోర్డు నిధులు వినియోగిస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయిస్తామన్నారు. రెండేళ్లలో పసుపు ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని, ఆయుర్వేద ఔషధాల తయారీలో పసుపు వినియోగానికి ప్రోత్సాహం ఇస్తామన్నారు.