కౌశిక్ రెడ్డి దమ్ముంటే దా తేల్చుకుందాం
NEWS Jan 14,2025 07:12 am
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తాకు సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు. నువ్వో నేనో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి ఓ సైకో లాగా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. పాడిని అడ్డం పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.