సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోడీ
NEWS Jan 14,2025 06:44 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్రాంతి పండుగ సందర్బంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండుగ వేడుకల్లో పాల్గొన్నారు పీఎం. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి, పొంగల్ ను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని వారందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.