ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
NEWS Jan 14,2025 06:19 am
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగుజాతి ప్రజలందరికీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ప్రజలందరి మనోవాంఛలు నెరవేరాలని, వారి కుటుంబాల్లో భోగ భాగ్యాలు, సిరి సంపదలు, ఎల్లలు లేని ఆనందం నింపాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని పేర్కొన్నారు.