వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లు జారీ
NEWS Jan 14,2025 04:25 am
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. 15వ తేదీ కోటా పూర్తయిందని తెలిపింది. 16వ తేదీ దర్శనానికి సంబంధించిన కోటాను విడుదల చేసినట్లు వెల్లడించింది. తిరుపతి లోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్లు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. భక్తులు క్యూ లైన్ ద్వారా టోకెన్లు తీసుకోవాలని సూచించింది.