తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Jan 14,2025 04:02 am
భక్త బాంధవులతో తిరుమల పుణ్య క్షేత్రం కిట కిట లాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 74 వేల 800 మంది భక్తులు దర్శించుకున్నారు. 17 వేల 726 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.48 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతోందన్నారు.