మాజీ ఎంపీ మృతి తీరని లోటు
NEWS Jan 14,2025 03:58 am
వైయస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉనుకూరు శాసనసభ్యుడిగా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, డీసీసీబీ ఛైర్మన్ గా పలు కీలక పదవుల్లో పనిచేసిన రాజశేఖరం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.