నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు
NEWS Jan 14,2025 03:51 am
సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పసుపు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది. పసుపు బోర్డు వల్ల పసుపును పండించే రైతులకు చాలావరకు మేలు కలుగుతుంది. కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హర్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెట్ వరకు రైతులకు లబ్ధి ఉంటుంది.పంటకు మద్దతు ధర ఎక్కువగా వస్తుంది. పసుపు తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం లాంటివి చేసేందుకు అవసరమైన యంత్రాలకు ప్రభుత్వం రాయితీ లభిస్తుంది.