కామారెడ్డి ‘మాస్టర్ ప్లాన్’ బాధితుడి ఆమరణ దీక్ష
NEWS Jan 14,2025 03:08 am
కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ ఎత్తివేయాలని మాస్టర్ ప్లాన్ బాధితుడు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ బాధితుల్లో ఒకరైన శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం రాత్రి ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో మాస్టర్ ప్లాన్ విషయంలో 45 రోజుల పాటు చేసిన పోరాటంలో పయ్యావుల రాములు అనే రైతు మృతి చెందారని గుర్తుచేశారు.