నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌పై వేటు
NEWS Jan 13,2025 03:50 pm
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతిమారాజ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి చిన్న పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.రాత్రి చికిత్స కోసం వచ్చిన రోగికి వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించారనీ, తన ఛాంబర్లో సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ పుట్టిన రోజు వేడుకలను సిబ్బంది జరిపారు.విధుల్లో ఉండాల్సిన సిబ్బంది పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. దీంతో వేటు వేశారు.