సంక్రాంతి సంబురాల్లో నారాయణ
NEWS Jan 13,2025 10:48 am
సంక్రాంతి పండుగ సంబురాలలో పాల్గొన్నారు మంత్రి పొంగూరు నారాయణ. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భోగి వేడుకలకు హాజరయ్యారు. తెలుగు వారందరికీ ఇష్టమైన అతి పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు మంత్రి. తనను నియోజకవర్గ ప్రజలు 74 వేల మెజారిటీతో గెలిపించారని, వారందరికీ పేరు పేరునా పండుగ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.